WHAT'S NEW?
Loading...

ఆధార్ కార్డు తో లింక్ అయిన మీ బ్యాంకు ఎకౌంటు ల వివరాలు మొబైల్ ద్వారా తెలుసుకోవాలంటే ... క్రింది ఇవ్వబడిన సింపుల్ ట్రిక్ తో తెలుసుకోవచ్చు.


ఈ పోస్ట్ ముఖ్యం గా గ్యాస్ సబ్సిడీ పొందే వారికి బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్ ఎకౌంటు కి ఆధారకార్డ్ లింక్ ఉంటేనే సబ్సిడీ వస్తుంది . ఆదార్ కార్డు ఏ బ్యాంకు కి లింక్ అయింది , ఏ బ్యాంకు కి  సబ్సిడీ అమౌంట్ వస్తుంది అని సందేహం వుండేవారు ..ఈ ట్రిక్ ని వుపయోగించి సులువుగా తెలుసుకోవచ్చు . 

1.మొబైల్ లో *99*99*1# డైల్ నెంబర్ చేయాలి  (లేదా) *99*99#  డైల్ చేసి 1 ఆప్షన్ సెలెక్ట్ చేయాలి 
2.వచ్చిన స్క్రీన్ లో మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Send క్లిక్ చేయాలి
3.వచ్చిన స్క్రీన్ లో Confirm చేయడానికి 1 ఎంటర్ చేసి Send క్లిక్ చేయాలి

క్రింది స్క్రీన్ చూడండి :మీ ఆధార్ కార్డు తో లింక్ అయిన మీ బ్యాంకు ఎకౌంటు వివరాలు తెలుస్తాయి | ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి .

Verify Through Mobile Aadhaar card Linked With Bank Account Trick
Google సరికొత్త app Files Go  తో మీ మొబైల్ Storage ని మేనేజ్ చేసుకోండి.మొబైల్  లో ఫైల్ మేనేజ్మెంట్ కోసం ఇటీవలే గూగుల్ Files Go App ని  రిలీజ్ చేసింది. ఈ app ద్వారా ఎలాంటి ఉపయోగాలున్నాయో ఈ ఆర్టికల్ లో తెలుసుకొందాం.


1. Mobile లో ఉపయోగించకుండా ఉన్న Apps ని చూపెడుతుంది 

చాల మంది App లను అవసరం లేకపోయినా అదేపనిగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి App లను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేస్తూ వుంటారు . ఉపయోగించడం కూడా మరచిపోతారు. అలాంటి apps వలన మొబైల్ లో స్పేస్ వేస్ట్ అయిపోతూ వుంటుంది.Files Go  4 వారాల నుండి వినియోగించని ,అలాంటి App లను గుర్తించి చూపెడుతుంది. అలా మనకు చూపించాలంటే... చిన్న సెట్టింగ్స్ చేసి apps పర్మిషన్ Files Go app కి ఇవ్వా ల్సివుంటుంది.

2.Mobile లో డూప్లికేట్ ఫైల్స్ ని వెతికి పెడుతుంది 

మొబైల్ లో డూప్లికేట్ ఫైల్స్ వుంటే , మొబైల్ స్పేస్ వేస్ట్ అయిపోతూవుంటుంది. అలా డూప్లికేట్ ఫైల్స్ ని సైజు వారీగా వెతికి మనకు చూపెడుతుంది. డూప్లికేట్ ఉన్న ఫైల్స్ ని సెలెక్ట్ చేసుకొని , డిలీట్ చేయడం ద్వారా మొబైల్ లో స్పేస్ ని ఆదా చేసుకోవచ్చు.

3. Files షేరింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది 

మొబైల్ లో ఫైల్స్ షేర్ చేయడానికి ShareiT ని వుపయోగిస్తుంటాము కదా ? Files Go App ని అలాగే ఉపయోగించుకోవచ్చు. 

4. Mobile లో Large వెతికి పెడుతుంది 

మొబైల్ లో స్పేస్ లేనప్పుడు , మనం Large ఫైల్స్ కోసం వెతికి డిలీట్ చేస్తుంటాం కదా ? అలా Big ఫైల్స్ ని వెతికిపెట్టి మనకు చూపెడుతుంది . దానివలన మనకు వెతికే టైం ఆదా అవుతుంది. 

5.మొబైల్ లో ఫైల్ type ( ఇమేజ్ , వీడియోస్ , మ్యూజిక్ ...) category చేసి చూపెడుతుంది

6. Cache క్లీనింగ్ చేసేస్తుంది

మొబైల్ లో apps ఉపయోగిస్తున్నప్పుడు , internal గా Apps పనిచేయాలంటే మొబైల్మె device memory  వుపయోగిస్తూవుంటుంది . వినియోగం అయినవెంతనే ఆ memory ఫ్రీ అవకుండా ఉండిపోతుంది. దానివలన స్పేస్ waste అవుతూ వుంటుంది. అలంటి memory ఫ్రీ ( Cache) చేయడానికి ఉపయోగపడుతుంది .   

పైన చెప్పిన 6 వుపయోగాలన్ని మనం 6 app లను ఉపయోగించకుండా ఒకే app తో పని అయిపోతే బావుంటుంది కదా ? :) అన్ని apps కోసం మొబైల్ storage కూడా సేవ్ చేసుకోవచ్చు . గూగుల్ వారితో తయారుచేయబడిన ఈ app చాల బాగా ఉపయోగపడుతుంది . Files Go App ని  లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి .Files Go Download Link
ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియో చూడండి | తప్పకుండా ఈ ఆర్టికల్ షేర్ చేయండి | video source : Tekpedia Telugu
'WhatsApp Gold' version' ఈ మెసేజ్ whatsapp లో ఎక్కువగా పంపుతున్నారు ,గ్రూప్ లలో కూడా ఎక్కువ కనపడుతుంది . ఈ  లింక్ (www.goldenversion.com) క్లిక్ చేస్తే whatsapp గోల్డ్ కలర్ లోకి మారుతుందనే మెసేజ్ తో చాల మంది నిజమే అనుకోని క్లిక్ చేస్తున్నారు . ఈ మెసేజ్ తో చాలా జాగ్రత్త , పొరబాటున క్లిక్ చేసారంటే అంతే ... తెలియకుండానే  404 వైరస్ మొబైల్ లోకి  ప్రవేశించి , మొబైల్ లో Data హాకర్ ల చేతిలోకి వెళ్ళిపోతుంది,ఇదో malware వైరస్, లింక్ క్లిక్ చేసిన వెంటనే వైరస్ మొబైల్ ఫోన్ లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇంతకు మునుపు ఇలాంటి వైరస్ ( WhatsApp Plus ) కూడా ఇలానే whatsapp హల్చల్ చేసింది .కానీ డేటా loss ఎలాంటి వార్తలు రాలేదు. whatsapp కూడా అలాంటి లతో జాగ్రత్తగా ఉండమని అధికారికంగా ప్రకటించింది. ఏదైనా ఇలాంటి అప్డేట్ నిజం గా వుంటే whatsapp నోటిఫికేషన్ పంపుతుంది. ఇలాంటి మెసేజ్ నమ్మి మీ విలువైనా data loss చేసుకోకండి.
Facebook లో చాట్ చేసేందుకు ఫ్రెండ్స్ ఎవరు ఆన్లైన్ లో లేరా ? లేదా చాట్ చేసి బోర్ కొట్టేసిందా ?అయితే మీ కోసమే ఈ సరదా ఆర్టికల్ . మెసెంజర్ లోనే ఇప్పుడు టైం పాస్ కోసం , ఫేస్బుక్ వాళ్ళు సీక్రెట్ గా ఒక చిన్న , ఫన్నీ గేమ్ ఉంచారు .అదే బాస్కెట్ బాల్ గేమ్ .ఎన్ని బాల్స్ మనం బాస్కెట్ లో కరెక్ట్ గా వేస్తామో కౌంట్ వచ్చేస్తుంది.

గేమ్ ఎలా ఆడాలో చూద్దామా ? 

చాలా సులువు గా ఈ గేమ్ ఆడేయవచ్చు , ఇందులో మనకు కావలిందల్లా , సరికొత్త ఫేస్బుక్ మెసెంజర్ వెర్షన్ , ఒకవేళ మీ మొబైల్ లో పాత వెర్షన్ ఉన్నట్లయితే Facebook Messenger New Version కోసం ఇక్కడ క్లిక్ చేసి update చేసుకోండి . ( ఆండ్రాయిడ్ ఫేస్బుక్ మెసెంజర్  )  ( iPhone ఫేస్బుక్ మెసెంజర్)
 • ఫేస్బుక్ మెసెంజర్ ఓపెన్ చేసి క్రింద వుండే Like ఐకాన్ ( 👍 ) ముందు వుండే smily ఇకాన్స్ group పైన క్లిక్ చేయాలి 
 • వచ్చిన emoji లిస్టు నుండి Bell ( 🔔 ) సెక్షన్ లో బాస్కెట్ బాల్ ఐకాన్ క్లిక్ చేసి send ఐకాన్ క్లిక్ చేయాలి 
 • తర్వాత బాల్ పైన Tap చేస్తే గేమ్ ఓపెన్ అవుతుంది . సరదాగా ఎన్ని బాల్స్ బాస్కెట్ లో వేస్తారో చూడండి 😃
ఫేస్బుక్ లో ఫోటో లు షేర్ లు అప్లోడ్ లు చేస్తుంటాము , వీటన్నింటి ని ఆల్బమ్ లో arrange చేసుకొంటూ ఉంటాము . అవసరమయినపుడు ఫోటో లను డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫేస్బుక్ ఆల్బమ్ లోకి వెళ్లి మనకు కావలసిన ఫోటో ను డౌన్లోడ్ చేసుకొంటూ ఉంటాము కదా ? అలా కాకుండా ఆల్బమ్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎలా ? ఒక్కో ఫోటో ను ఓపెన్ చేసుకొని save చేయాలంటే కొంత టైం పడుతుంది .

ఒక ఆల్బమ్ లో ఎక్కువ ఫోటో లు ఉన్నాయంటే డౌన్లోడ్ చేయడం కొంచం కష్టం గానే వుంటుంది. అలా కాకుండా ఒకే క్లిక్ తో ఆల్బమ్ మొత్తం డౌన్లోడ్ అయితే ...? అవును ఈ క్రింద ఇవ్వబడిన  వెబ్సైటు వుపయోగించి చాలా సులువు గా ఒకే క్లిక్ తో ఆల్బమ్ డౌన్లోడ్ చేయోచ్చు . దీనికోసం Pick&Zip వెబ్సైటు చాలా బాగా ఉపయోగపడుతుంది .


ఒకే క్లిక్ తో ఆల్బమ్ డౌన్లోడ్ ఎలా చేయాలో చూద్దామా ?

 • మొదట http://www.picknzip.com/ ఓపెన్ చేయాలి 
 • ఫేస్బుక్ లో లాగిన్ అయి వుండాలి 
 • పైన right side వుండే Facebook Download బటన్ పైన క్లిక్ చేయాలి
 • తర్వాత కొన్ని పర్మిషన్ లు ఇవ్వడం ద్వారా వెబ్సైటు కి పర్మిషన్ ఇవ్వాల్సి వుంటుంది ( క్రింది slide లను చూడండి )
 • తర్వాత Find My Photos & Videos బటన్ పైన క్లిక్ చేస్తే ఆల్బమ్ ఫొటోస్ / వీడియోస్ అన్ని display చేయబుతాయి 
 • మనకు కావలసిన ఆల్బమ్ సెలెక్ట్ చేసుకొని ఆ ఆల్బమ్ చివర డౌన్లోడ్ Arrow ( ) బటన్ క్లిక్ చేయాలి .
 • ఏ ఫార్మటు (PDF లేదా  ZIP )లో డౌన్లోడ్ చేయాలో అడుగుతుంది , ఏ ఫార్మటు ఇస్తామో ఆ ఫార్మటు లో ఆల్బమ్ డౌన్లోడ్ అవుతుంది .

ఇలా చాలా సులువు గా ఆల్బమ్ లేదా మనకు కావలసిన ఫోటోలు లేదా వీడియో లు డౌన్లోడ్ చేసుకోవచ్చు . 
ఈ ఆర్టికల్ క్రింద ఉన్న షేర్ బటన్స్ పైన క్లిక్ చేసి , మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి 
మొబైల్ తో సరదాగా సేల్ఫీ తీసుకోనేవాళ్లకు ఈ ఆర్టికల్ లో ఒక మంచి app గురించి తెలుసుకొందాం . ఏదో సేల్ఫీ తీసుకొన్నామా ? Whatsapp లేదా ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొన్నామా అని కాకుండా , తీసుకొనే సేల్ఫీ లకు మంచి ఎఫెక్ట్స్ జోడించి షేర్ చేసామనుకోండి ... Likes , కామెంట్స్ సూపర్ గా వచేస్తుంటాయి కదూ ... దీనికోసమే ఈ ఆర్టికల్ లో YouCam Perfect , ఈ App బెస్ట్ ఫోటో సేల్ఫీ app అనే చెప్పొచ్చు .

App ఎలా పనిచేస్తుంది , దీఎనిలో ఉన్న ఫీచర్స్ తెలుసుకొందామా ?

 • phto లు తీసే టైం లోనే తీయబోయే ఫోటో ఫిల్టర్ ఎఫెక్ట్ ఎలా ఉండాలో సెలెక్ట్ చేసుకొని సేల్ఫీ తీసుకోవచ్చు 
 • టైమర్ సెట్ చేసుకొని టైం ప్రకారం ఫోటో క్లిక్ అయ్యేలా చూడొచ్చు
 • సేల్ఫీ తీసిన తర్వాత bright గా చేయోచ్చు 
 • Beauty ఆప్షన్ లో వుండే ఆప్షన్స్ లో వివిధ రకాలయిన ఎఫెక్ట్స్ అప్లై చేయోచ్చు 
 • Hard గా ఉన్న Face ని smooth గా చేయోచ్చు , ఆయిల్ face ని bright గా మర్చేయోచ్చు 
 • స్మైల్ ఇవ్వడం మరచిపోయారా , అయినా పర్వాలేదు smile ఆప్షన్ పైన క్లిక్ చేస్తే చాలు , Face smile గా మారిపోతుంది .
 • సేల్ఫీ లేదా ఇదివరకు మన దగ్గర ఉన్న ఇమేజ్ లలో Red Eye వుంటే దాన్ని remove చేసే ఆప్షన్ ఉంది 
ఇలా ఒకటేమిటి , చాల రకాలయిన ఆప్షన్స్ ఈ app లో ఉన్నాయి ... ఈ క్రింది ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ app ని playstore నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు . ఈ ఆర్టికల్ మీ ఫ్రెండ్స్ తో కూడా share చేయండి . :)

ఆండ్రాయిడ్ App YouCam Perfect Download Link

ఆండ్రాయిడ్ మొబైల్ స్లో గా లోడ్ అవుతుందా ? స్లో గా లోడ్ అవడం వలన చాలా చికాకుగా అనిపిస్తూ వుంటుంది కదా ? ఈ ఆర్టికల్ లో ఇవ్వబడిన కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా మన ఆండ్రాయిడ్ మొబైల్ ను మునుపటికంటే వేగంగా చేయవచ్చు . దీనికోసం ఎటువంటి software ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే , మొబైల్ లో ఉన్న కొన్ని సెట్టింగ్ లు మార్చడం ద్వారా ఈ పని చేయవచ్చు .ఈ సెట్టింగ్ లను మార్చాలంటే ముందుగా మొబైల్ ను Developer Mode లోకి మార్చాల్సి ఉంటున్నది .


మొబైల్ ను Developer Mode లోకి ఎలా మార్చాలి ?

ముందుగా సెట్టింగ్ లోకి వెళ్లి Developer ఆప్షన్స్ లోకి వెళ్ళాలి , developer ఆప్షన్స్ లేదంటే , About Devices ఆప్షన్ పైన Tap చేస్తే వచ్చే screen లో Build Number ఆప్షన్ వుంటుంది , Build Number ఆప్షన్ పైన 7 సార్లు Tap చేస్తే మొబైల్ లో Developer ఆప్షన్ వస్తుంది .తర్వాత Settings screen లోకి వెళ్ళితే Developer ఆప్షన్ కనబడుతుంది . ( సెట్టింగ్స్  స్క్రీన్ లో చూడండి )
 • Developer ఆప్షన్ లో చివర లో Windows Animation Scale,Trasaction Animation Scale,Animatio Duration Scale ఆప్షన్స్ చూడవచ్చు , అది Default గా 1X సెట్ చేయబడివుంటుంది ( 1x నుండి 10 x వరకు ఉంటాయి) , Anmation Off చేయోచ్చు లేదంటే తగ్గించుకోవడం (0.5) చేయాలి.Windows వేగం గా లోడ్ అవడం గమనించవచ్చు 
 • Developer ఆప్షన్ లో Apps సెక్షన్ లో Do Not Keep Activities , Check Box సెలెక్ట్ చేయడం ద్వారా ఉపయోగించే App నుండి Exit అయితే Background లో App రన్ అవకుండా close అవుతుంది , దీని ద్వారా మొబైల్ వేగం గా వుంటుంది . కానీ whatsapp , facebook app లు close చేసినా కూడా Background లో రన్ అవాల్సిన అవసరం లేదనుకొన్న వారు ఈ ఆప్షన్ ఉపయోగించవచ్చు .
 • ఒకేసారి ఒకటికంటే ఎక్కువ Apps రన్ అవుతున్నప్పుడు , కొన్ని సమయాల్లో ఒకటి తర్వాత ఒకటి ఓపెన్ చేస్తూ ఉంటాము కదా ? అలా ఎన్ని apps ఓపెన్ కావాలనే Limit సెట్ చేసుకోవచ్చు . Default గా Standrd వుంటుంది (ఓపెన్ చేసిన Apps లో ఏ App కయినా మారే అవకాసం వుంటుంది ) . Apps మనకు Background లో ఎన్ని  కావాల్సిన Number  ( 1 నుండి 4  ) సెట్ చేసుకోవచ్చు . ఒకటి కూడా వద్దనుకొంటే No Background Processes సెట్ చేసుకోవచ్చు .
ఇలా ఏ software లేకుండా , మొబైల్ device ను ఈ చిన్న సెట్టింగ్స్ వుపయోగించి , వేగవంతం చేయోచ్చు .
ఈ ఆర్టికల్ మీ మిత్రులతో కూడా షేర్ చేయండి . 

గూగుల్ సెర్చ్ లో , చిన్న పిల్లలకు జంతువుల , పక్షుల అరుపులు నేర్పే కొత్త ఫీచర్ 

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం ప్రతిసారి ఏదో ఒక కొత్త ప్రయోగం మన ముందుకు తెస్తూనే ఉంది , మన లైఫ్ లో గూగుల్ కూడా ఒక బాగమైపోయింది కదూ , ఇప్పుడు చిన్న పిల్లల కోసం ఒక అద్బుతమైన ఒక ఫీచర్ తెచ్చింది , అదేంటంటే , చిన్న పిల్లలకు మనం జంతువుల , పక్షుల అరుపులు నేర్పిస్తుంటాం కదా ? అది ఇప్పుడు గూగుల్ సెర్చ్ నుండే నేర్పించేయవచ్చు . 

మనం ఏ జంతువు లేదా పక్షి అరుపు ఎలా అరుస్తుంది అనే వాక్యం గూగుల్ లో టైప్ చేసి సెర్చ్ చేస్తే చాలు , ఆ జంతువు లేదా పక్షి బొమ్మ తో పాటు గా ఆడియో ఐకాన్ వస్తుంది , ఐకాన్ క్లిక్ చేస్తే చాలు ఆ సౌండ్ వచ్చేస్తుంది , చిన్న పిల్లలకు సరదాగా ఇలా సెర్చ్ చేసి ఎంచక్కా సౌండ్స్ నేర్పించేయవచ్చు . ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో చిన్న పిల్లలు వుంటే ఇలా నేర్చ్పించేయండి . ఇలాంటి మరిన్ని ఫన్నీ ఆర్టికల్స్ తర్వాతి పోస్ట్ లో చూస్తుండండి . ఈ ఆర్టికల్ షేర్ చేయడం మరచిపోవద్దు :) 

ఎలా చేయాలో క్రింది ఉదాహరణ చూడండి :

ఇలా ఏ జంతువు లేదా పక్షి సౌండ్ కావాలో సెర్చ్ చేసి వినవచ్చు ...
Ex 1: What Does The Dog Say 
Ex 2: What Does The Parrot Say 
Ex 3: What Does The Cat Say 
Ex 4: What Does The Duck Say 
Ex 5: What Does The Lion Say 
way2sms ఈ వెబ్సైటు గురించి తెలియని వారుండరు . ఫ్రీ గా మెసేజెస్ పంపేందుకు ఇండియా లో వున్న అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్సైటు లలో ఈ వెబ్సైటు ఒకటి . ఈ వెబ్సైటు నుండి మెసేజ్ లు పంపడమే కాదు , ఎన్నో ఉపయోగాలున్నాయి . జిమెయిల్ , యాహూ మెయిల్స్ ఇక్కడ నుండే మనం చెక్ చేసుకొనే సదుపాయం వుంది , ఫేస్బుక్ కూడా మనం ఇక్కడ నుండే లాగిన్ అయి ఉపయోగించుకోవచ్చు . ఇలా ఎన్నో సదుపాయాలు వున్నా ఈ వెబ్సైటు లో వున్నామరో ఆప్షన్ మనకు నచ్చిన మన తెలుగు లో Unlimited మెసేజ్ లు పంపే వీలుంది . ఎలా చేయాలి అనే విషయం తెలిస్తే ఈ పోస్ట్ చూడనవసరం లేదు . ఉపయోగం అనిపిస్తే ఆర్టికల్ షేర్ చేయండి . 

వెబ్సైటు నుండి ఉచితం గా sms లు తెలుగు లోనే పంపుకోవచ్చో తెలుసుకొందాం ... 

 • మొదట ఈ లింక్ క్లిక్ చేసి www.way2sms లో రిజిస్టర్ చేసుకోవాలి 
 • తర్వాత Send Free SMS బటన్ పైన క్లిక్ చేయాలి 
 • తర్వాత New Language SMS ఆప్షన్ పైన క్లిక్ చేయాలి 
 • ఎవరికి ఐతే మెసేజ్ పంపుతున్నమో వారి మొబైల్ నెంబర్ టైపు చేసి , క్రింద వున్నా లాంగ్వేజ్ లో " Telugu " ఎంచుకోవాలి 
 • తర్వాత మెసేజ్ టైపు చేసి ( తెలుగు లో ) Send పైన క్లిక్ చేయడమే . 

ఫేస్బుక్ వీడియో లు ఆటోమేటిక్ గా ప్లే అవడం ON / OFF చేయడం ఎలా ?

సోషల్ మీడియా ( ఫేస్బుక్ లేదా ట్విట్టర్ ) లో ఈ మధ్యకాలం లో చాలా కొత్త Updates వచేస్తున్నాయి . ఏదైనా వీడియో మన టైం లైన్ లో లేదా wall పైన ఒక వీడియో వచ్చిందంటే , అది మన ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్ గా ప్లే అయిపోతుంటుంది . ఫేస్బుక్ లో ఎక్కువ వీడియో లు చూసే కొందరి అయితే నచ్చుతుంది , నచ్చని వారు అలా ఆటోమేటిక్ గా ప్లే కాకుండా ఆటో ప్లే ఆప్షన్ Stop / Disable చేసుకొనే అవకాసం కూడా వుంది . ఎలా చేయాలో క్రింది Steps చూడండి ... తక్కువ ఇంటర్నెట్ డేటా తక్కువ ఉన్నవారికి లేదా , మొబైల్ 2జి డేటా ఉన్నవాళ్ళకి ఈ ఆప్షన్ ఉపయోగిస్తే ఇంటర్నెట్ డేటా తక్కువ వినియోగం  అవుతుంది . 

ఫేస్బుక్ వీడియో లు ఆటోమేటిక్ గా ప్లే అవడం ON / OFF చేయడం ఎలా ( ఆండ్రాయిడ్ మొబైల్ ) ?

 • ఫేస్బుక్ పైన Right Side లో వుండే Down Arrow (↓) ని క్లిక్ చేయాలి 
 • వచ్చిన menu లో Settings ని ఎంచుకోవాలి 
 • Left Side లో చివర వుండే వీడియో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి 
 • Auto Play Never Auto play Videos బటన్  సెలెక్ట్  చేసుకోవాలి 
అంతే కాకుండా ... ప్లే అయ్యే వీడియో లు మొబైల్ డేటా తో ప్లే లేదా wifi మాత్రమె అనే ఆప్షన్స్ కూడా Set చేసుకోవచ్చు ... 
ఫేస్బుక్ వీడియో లు ఆటోమేటిక్ గా ప్లే అవడం ON / OFF చేయడం ఎలా ( Desktop / Laptop  ) ?

 • ఫేస్బుక్ App Open చేయాలి 
 • Menu Button ని Tap చేసి , App Settings ని Tap చేయాలి 
 • చివర వుండే Autoplay Tap చేయాలి 
 • Auto Play Videos ఆప్షన్ దగ్గర ON OFF సెలెక్ట్  చేసుకోవాలి 
Auto Play Videos ఆప్షన్ దగ్గర , మొదటి ఆప్షన్ Video Default Quality దగ్గర వుండే 3 ఆప్షన్స్ లో మనకు కావలసిన ఆప్షన్ set చేసుకోవడమే ... ఆప్షన్స్ : Default , SD ( Standard Quality ) మరియు HD ( High Definition )
జిమెయిల్ లో మెయిల్స్ ఎక్కువయినప్పుడు , కొన్ని అనవసర మెయిల్స్ డిలీట్ చేస్తుంటాము , చూసుకోకుండా కొన్ని అవసరమయిన మెయిల్స్ కూడా చూసుకోకుండా డిలీట్ చేస్తుంటాము . అవి Trash ఫోల్డర్ లో కి వెళితే తిరిగి Inbox కి మూవ్ చేసుకొనే సదుపాయం ఉంది . అలా కాకుండా Trash లో డిలీట్ చేసిన మెయిల్ కూడా డిలీట్ అయిందనుకోండి అప్పుడెలా రికవరి చేసుకోవడం ? దానికి కూడా జిమెయిల్ లో సదుపాయం ఉంది .పర్మినంట్ గా డిలీట్ చేసిన మెయిల్ ని తిరిగిపొందేదానికి జిమెయిల్ టీం కి మనం రిక్వెస్ట్ పెట్టవచ్చు . ఎలా అంటే చాలా సులువు.

పర్మినంట్ గా డిలీట్ చేసిన మెయిల్ ని తిరిగి రికవరి ఎలా చేయాలో చూద్దామా ? 
 • ఈ లింక్ పైన క్లిక్ చేయండి , డిలీట్ అయిన మెయిల్ రికవర్ చేయడానికి , వివరాలు ఇవ్వవలసి వుంటుంది.
 •  An email address we can use to contact you * దగ్గర ఏ ఇమెయిల్ లో రికవరీ చేయాలో ఆ మెయిల్ id ఉండేలా చూసుకోవాలి . 
 • You're currently logged in ......... ( Yes / No ) .. దగ్గర Yes సెలెక్ట్ చేయాలి When did you first notice ..... missing? దగ్గర ఎప్పుడు మీ మెయిల్ చివరిగా చూసారో ఆ తేదీ enter చేయాలి 
 •  Description of your issue ... దగ్గర పొరపాటున డిలీట్ చేసినట్లు గా Description రాయాలి. 
 • ఇవ్వబడిన వివరాల ప్రకారం , జిమెయిల్ టీం verify చేసి మనకు మెయిల్ రికవరీ చేసి మన జిమెయిల్ Inbox లోకి తిరిగి పంపి , మనకు రికవరీ చేసినట్లుగా మెసేజ్ పంపుతారు . 

బ్రౌజరు లో open చేసిన వెబ్సైటు హిస్టరీ,డౌన్లోడ్ హిస్టరీ , cookie లను తొలగించేందుకు గూగుల్ని క్రోమ్ బ్రౌజరు కోసం క్రింది ఇవ్వబడిన క్రోమ్ Extension అద్బుతం గా పనిచేస్తుంది .Extension ఎలా పని చేస్తుందో చూద్దామా ? 

ఈ Extension వుపయోగించి ... వెబ్సైటు హిస్టరీ,డౌన్లోడ్ హిస్టరీ,ఇంతక ముందు సెర్చ్ చేసిన డేటా ఆటోమేటిక్ గా డిస్ప్లే కాకుండా ఉండటానికి కావలసిన సదుపాయాలన్నీ ఈ Extension లో వున్నాయి . ఈ Extension తప్పకుండా గూగుల్ క్రోమ్ కి తప్పకుండా ఉండాల్సిన అద్బుతమయిన టూల్ . Extension ని లింక్ క్లిక్ చేయడం ద్వారా క్రోమ్ బ్రౌజరు కి ఇన్స్టాల్ చేయండి .

History Eraser App క్రోమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత బ్రౌజరు కి ఇన్స్టాల్ చేయబడుతుంది ఇన్స్టాల్ చేయబడిన Extension క్లిక్ చేసి ఉపయోగించుకోవచ్చు ( క్రింది ఇమేజ్ ని చూడండి )