1. Mobile లో ఉపయోగించకుండా ఉన్న Apps ని చూపెడుతుంది
చాల మంది App లను అవసరం లేకపోయినా అదేపనిగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి App లను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేస్తూ వుంటారు . తర్వాత ఉపయోగించడం కూడా మరచిపోతారు. అలాంటి Apps వలన మొబైల్ లో స్పేస్ వేస్ట్ అయిపోతూ వుంటుంది.
Files Go 4 వారాల నుండి వినియోగించని ,అలాంటి App లను గుర్తించి చూపెడుతుంది. అలా మనకు చూపించాలంటే... చిన్న సెట్టింగ్స్ చేసి Apps పర్మిషన్ Files Go app కి ఇవ్వాల్సివుంటుంది.
2.Mobile లో డూప్లికేట్ ఫైల్స్ ని వెతికి పెడుతుంది
మొబైల్ లో డూప్లికేట్ ఫైల్స్ వుంటే , మొబైల్ స్పేస్ వేస్ట్ అయిపోతూవుంటుంది. అలా డూప్లికేట్ ఫైల్స్ ని సైజు వారీగా వెతికి మనకు చూపెడుతుంది. డూప్లికేట్ ఉన్న ఫైల్స్ ని సెలెక్ట్ చేసుకొని , డిలీట్ చేయడం ద్వారా మొబైల్ లో స్పేస్ ని ఆదా చేసుకోవచ్చు.
3. Files షేరింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది
మొబైల్ లో ఫైల్స్ షేర్ చేయడానికి File Share Apps న వుపయోగిస్తుంటాము కదా ? Files Go App ని అలాగే File Sharing కోసం ఉపయోగించుకోవచ్చు.
4. Mobile లో Large వెతికి పెడుతుంది
మొబైల్ లో స్పేస్ లేనప్పుడు , మనం Large ఫైల్స్ కోసం వెతికి డిలీట్ చేస్తుంటాం కదా ? అలా Big ఫైల్స్ ని వెతికిపెట్టి మనకు చూపెడుతుంది . దానివలన మనకు వెతికే టైం ఆదా అవుతుంది.
5.మొబైల్ లో ఫైల్ type ( ఇమేజ్ , వీడియోస్ , మ్యూజిక్ ...) category చేసి చూపెడుతుంది
6. Cache క్లీనింగ్ చేసేస్తుంది
మొబైల్ లో apps ఉపయోగిస్తున్నప్పుడు , internal గా Apps పనిచేయాలంటే మొబైల్ device memory వుపయోగిస్తూవుంటుంది . వినియోగం అయిన వెంటనే memory ఫ్రీ అవకుండా ఉండిపోతుంది. దానివలన స్పేస్ waste అవుతూ వుంటుంది. Memory ఫ్రీ ( Cache) చేయడానికి ఉపయోగపడుతుంది .
పైన చెప్పిన 6 వుపయోగాలన్ని మనం 6 app లను ఉపయోగించకుండా ఒకే app తో పని అయిపోతే బావుంటుంది కదా ? :) గూగుల్ నుండి తయారుచేయబడిన ఈ App చాల బాగా ఉపయోగపడుతుంది .
Files Go App ని లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి .Files Go Download Link