'WhatsApp Gold' version' ఈ మెసేజ్ whatsapp లో ఎక్కువగా పంపుతున్నారు ,గ్రూప్ లలో కూడా ఎక్కువ కనపడుతుంది . ఈ లింక్ (www.goldenversion.com) క్లిక్ చేస్తే whatsapp గోల్డ్ కలర్ లోకి మారుతుందనే మెసేజ్ తో చాల మంది నిజమే అనుకోని క్లిక్ చేస్తున్నారు .
ఈ మెసేజ్ తో చాలా జాగ్రత్త , పొరబాటున క్లిక్ చేసారంటే అంతే ... తెలియకుండానే 404 వైరస్ మొబైల్ లోకి ప్రవేశించి , మొబైల్ లో Data హాకర్ ల చేతిలోకి వెళ్ళిపోతుంది,ఇదో malware వైరస్, లింక్ క్లిక్ చేసిన వెంటనే వైరస్ మొబైల్ ఫోన్ లోకి డౌన్లోడ్ అయిపోతుంది.
ఇంతకు మునుపు ఇలాంటి వైరస్ ( WhatsApp Plus ) కూడా ఇలానే whatsapp హల్చల్ చేసింది .కానీ డేటా loss ఎలాంటి వార్తలు రాలేదు. whatsapp కూడా అలాంటి లతో జాగ్రత్తగా ఉండమని అధికారికంగా ప్రకటించింది.
ఏదైనా ఇలాంటి అప్డేట్ నిజం గా వుంటే whatsapp నోటిఫికేషన్ పంపుతుంది. ఇలాంటి మెసేజ్ నమ్మి మీ విలువైనా data loss చేసుకోకండి.