ఫోటోషాప్ నేర్చుకొందాము 3 - ఫోటోషాప్ బేసిక్స్ - కొత్త డాక్యుమెంట్ తయారుచేయడం

2 minute read






కొత్త డాక్యుమెంట్ ఎలా తయారు చేయాలో , దానికి ఏ ఒప్షన్స్ ఎంచుకోవాలో ఈ పోస్ట్ లో చూద్దాము ,
ముందు గా ఒక New document తయారు చేయాలంటే Ctrl + n క్లిక్ చేయడం ద్వార New డాక్యుమెంట్ Create చేయడానికి కావలసిన విండో ఓపెన్ అవుతుంది .



1. Name దగ్గర createచేయదలచుకొన్న Name ఇవ్వాలి 

Present – మనము ఎలాంటి డాక్యుమెంట్ ని తయారు చేయాలో మనం తయారు చేసిన image/Photo 
2. వెబ్ సైట్ లోసంబందిచినది ఐతే Web  లేక 
3. Mobile సంబందిన్చినదా   లేక 
4. Film & Video కోసం చేస్తున్నామా 
అనేది దానినిబట్టి మనము Present లో Options ఎంచుకోవచ్చు .
లేదా ..
5. మనకు ఇష్టమొచ్చిన Present , సైజు ఇవ్వడం ద్వారా create చేయవచ్చు . 


ఇలా ఎంచుకొనేటప్పుడు ప్రతి Present కి వేర్వేరు (క్రింది screen లో చూపించినట్లు గ )సైజు లు కూడా ఎంచుకోవచ్చు, డీవీడీ ల కోసం NTSC, తెలివిసిఒన్ కోసం PAL ఉపయోగిస్తాము .


Pixel : పైన image లో మనము Pixel అనే పదము గమనించవచ్చు , క్రింది Image లో చతురస్ర గడులు గమనిచవచ్చు , వాటినే pixel అంటారు .  క్రింద " ఫో " అనే అక్షరం కొన్ని pixels తో నిర్మితమైవుంది . మనం ఎడిట్ చేయబోయే ఇమేజ్ ఎన్ని Pixels కలిగివుండాలో Width (Ex : 240) మరియు Height(Ex : 240) లలో నెంబర్ ఇవ్వడం ద్వారా ఇమేజ్ సైజు ను ఎంచుకోవచ్చు . (ఏక్ష్ : Size  : 240 X 320 )


Resolution : పైన image లో మనము Resolution అనే పదము గమనించవచ్చు, Resolution అంటే Pixels యెక్క సముదాయము, Resolution ఎక్కువ వుంటే , ఆ ఇమేజ్ లో Pixels కూడా ఎక్కువ వుంటాయి , Resolution ఎక్కువ వుంటే ఇమేజ్ clarity మరియు size ఎక్కువ వుంటుంది .

ఉదాహరణకి క్రింది ఇమేజ్ గమనిస్తే , దానిలో pixels ఎక్కువ వుండడం వాళ్ళ క్లారిటీ ఎక్కువగా వుంటుంది .

ఇమేజ్ పైన click చేస్తే ఇమేజ్ ఒరిజినల్ Clarity గమనించవచ్చు . 


పైన చెప్పబడిన Options మనకు కావలసిన విదంగా ఇచ్చి OK బటన్ క్లిక్ చ్జేయడం ద్వారా ఒక డాక్యుమెంట్ create చేయబడుతుంది , డాక్యుమెంట్ లో మనకు కావలసిన విదంగా ఫొటోస్ తయారు చేసుకొని Save చేసుకోవచ్చు .

Documents ని Save చేయడం :

తయారు చేయబడిన డాక్యుమెంట్ save చేయాలంటే Menu Bar లోకి వెళ్లి File > Save ఆప్షన్ ని ఎంచుకొని save చేసుకోవచ్చు . తయారు చేసుకొన్న Document , .PSD (Photo Shop Document ) ఫార్మాటు లో save అవుతుంది. 

అంతేకాకుండా Save చేయబడే డాక్యుమెంట్ / ఇమేజ్ వేర్వేరు ఫార్మాట్ లలో Save చేయవచ్చు , Menu Bar లోకి వెళ్లి  File > Save As ఆప్షన్ ని ఎంచుకొని save చేసుకోవచ్చు . తయారు చేసుకొన్న Document క్రింది ఫార్మాటు లలో సేవ్ చేయవచ్చు . 

Photoshop File (.psd, .pdd, .eps) - ఈ ఫార్మటు లలో డాక్యుమెంట్ Layers (Layers గురించి తర్వాతి Post లో వివరం గా తెలుసు కొందాము )లలో సేవ్ చేయబడుతుంది . ఇలా సేవ్ చేయబడిన డాక్యుమెంట్ మరలా Edit చేసుకోవడానికి ఉపయోగించవచ్చు . 

.jpg, .jpeg .jpe - ఫైనల్ గా సేవ్ చేయాలనుకొన్న ఇమేజ్ ను ఎక్కువగా ఇదే ఫార్మాట్ లో సేవ్ చేస్తారు , వెబ్ సైట్ కు ఈ ఫార్మటు ను ఎక్కువ ఉపయోగిస్తారు .


tif, .tiff - High Quality image లకు ఈ ఫార్మటు ఉపయోగిస్తారు . ఈ ఫార్మటు image File Size ఎక్కువగా వుంటుంది . 


.png :  jpg లానే వెబ్ సైట్ కు ఈ ఫార్మటు ను ఎక్కువ ఉపయోగిస్తారు . ఈ ఫార్మటు ఫైల్ సైజు తక్కువ వుంటుంది 



.bmp: Windows bitmapped image. Good quality, file size ఎక్కువ గా వుంటుంది . వెబ్ సైట్ లో ఈ ఫార్మటు ఉపయోగించారు .


.pdf : Portable Document File, ఇలా సేవ్ చేసిన ఫైల్స్ ని Adobe Acrobat లో ఓపెన్ చేయవచ్చు . 



Documents ని Open చేయడం : Menu Bar లోకి వెళ్లి  File > Open > Document Name, లేదా  Ctrl+O 


Documents ని UnDo చేయడం : డాక్యుమెంట్ లో పొరపాటు చేస్తే వెనకకు వెళ్లేందుకు క్రింది Shot Cuts ఉపయోగించాలి . 


  • Ctrl-Z :  ఒకసారి వెనకకు వెళ్ళవచ్చు (previous step).
  • Ctrl-Alt-Z : ఈ కమాండ్ ద్వారా డాక్యుమెంట్ Steps మొదటివరకు వెనకకు  వెళ్ళవచ్చు 
  • Shift-Alt-Z  : ఈ కమాండ్ ద్వారా డాక్యుమెంట్ Steps ముందుకు వెళ్ళవచ్చు 


మీ అబిప్రాయాలు తెలియచేస్తె , Explanation మరింత సరళం గా ఉండేలా ప్రయత్నిస్తాము . మీ అబిప్రాయాలు క్రింద Comment Box లో రాయండి లేదా tehwavetutorials@gmail.com కి పంపగలరు . 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top