Google Chrome తో చాలా ఉపయోగాలే వున్నాయి . గతం లో కొన్ని Tips ( ఇక్కడ క్లిక్ చేయండి ) చూశాము. ఈ పోస్ట్ లో మరికొన్ని Tips గురించి చూద్దాము.
Paste and go:
మనం వెబ్సైటు ని copy చేసి పెట్టుకొంటూ ఉంటాము కదా ? అవసరమయినప్పుడు copy చేసి పెట్టుకొన్న URL ని copy చేసి గూగుల్ బ్రౌజరు లో Right క్లిక్ చేసి paste చేసి Enter key press చేస్తాము కదా ? అలా కాకుండా ... Paste and go ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు ...Right క్లిక్ చేసి paste select చేసే బదులుగా Paste and go select చేసుకొంటే enter key press చేయకుండా నే automatic గా search చేయబడుతుంది.
Note : URL copy చేసుకొన్నప్పుడు మాత్రమే ఈ Paste and go Display చేయబడుతుంది.
Paste and Search:
ఇదేవిదంగా Word Document లోనో , లేక Notepad లోనో Text ని copy చేసుకొని search చేసుకోవాలనుకొన్నప్పుడు , (Note : గూగుల్ chrome బ్రౌజరు ని search కోసం కూడా ఉపయోగించుకోవచ్చు).search చేయాలనుకొన్న text ని copy చేసుకొని Paste కి బుదులుగా Paste and Search ఎంచుకొంటే చాలు , Text paste చేయబడి search చేయబడుతుంది Enter key press చేయకుండానే .
Note : Text copy చేసుకొన్నప్పుడు మాత్రమే ఈ Paste and search Display చేయబడుతుంది.
