మనకు ఒక మంచి వెబ్సైటు కనిపించినప్పుడు , ఆ వెబ్సైటు ని డౌన్లోడ్ చేసుకొని మన కంప్యూటర్ లో బద్రపరుచుకొని , మనకు time వున్నప్పుడు , ఇంటర్నెట్ కనెక్ట్ కాకుండా save చేసుకొన్న వెబ్సైటు ని Offline లో చూసుకొనేందుకు అనేక టూల్స్ మనకు నెట్ లో దొరుకుతాయి . ఆ టూల్స్ సహాయం తో మనకు నచ్చిన వెబ్సైటు / బ్లాగు ని డౌన్లోడ్ చేసిపెట్టుకోవచ్చు .
ఈ పోస్ట్ లో వెబ్సైటు / బ్లాగు ని డౌన్లోడ్ చేసిపెట్టుకోవడానికి ఒక మంచి టూల్ HTTrack Website Copier గురించి , ఎలా పనిచేస్తుంది , ... ఎలా చేయాలో చూసి మీకు నచ్చిన వెబ్సైటు / బ్లాగు ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి .
- మొదట ఈ క్రింద ఇవ్వబడిన వెబ్సైటు నుండి HTTrack Website Copier ని డౌన్లోడ్ చేసుకొని మీ కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకోండి .
- Install చేసిన తర్వాత ... HTTrack Website Copier ని ఓపెన్ చేయాలి .ఇప్పుడు మనం http://www.techwaves4u.blogspot.in బ్లాగు ని డౌన్లోడ్ చేయబోతున్నాము.
- ఓపెన్ చేసిన తర్వాత Next బటన్ పైన క్లిక్ చేయాలి ( క్రింది ఇమేజ్ లో చూడండి )
- తర్వాత New Project Name దగ్గర మీకు కావలసిన Name ఇవ్వండి ( Ex : Techwaves4u Blog)
- ఎక్కడ Save కావాలో ఆ Location దగ్గర ఇవ్వండి ( ఇప్పడు Desktop పై My Website లో Techwaves4u అనే folder లో save చేస్తున్నాము )
- Next బటన్ పైన క్లిక్ చేయాలి . ( క్రింది ఇమేజ్ లో చూడండి )
- తర్వాత వచ్చే విండో లో Web Addresses (URL) దగ్గర ఏ వెబ్సైటు డౌన్లోడ్ చేయాలనుకొంటున్నామో , ఆ వెబ్సైటు URL ( http://www.techwaves4u.blogspot.in ) ఇవ్వాలి .
- తర్వాత Set Options బటన్ పైన క్లిక్ చేయాలి .
- వచ్చిన విండో లో Limits టాబ్ పైన క్లిక్ చేయాలి .
- Maximum Mirroring Depth దగ్గర మనం ఎంత depth (Ex: 2)వరకు వెబ్సైటు / బ్లాగు ను డౌన్లోడ్ చేయాలో number ఇవ్వాలి . ( ఈ ఆప్షన్స్ గురించి వివరం గా తర్వాతి పోస్ట్ లలో తెలుసుకొందాము ).OK పైన క్లిక్ చేయాలి .
- తర్వాత Next బటన్ పైన క్లిక్ చేయాలి .
- తర్వాత వచ్చే విండో లో Finish బటన్ పైన click చేస్తే download Start అవుతుంది .
- Finish బటన్ పైన click చేస్తే డౌన్లోడ్ పూర్తయి , మనం ఇచ్చిన Location లో వెబ్సైటు / బ్లాగ్ save చేయబడుతుంది .
- Index.html file క్లిక్ చేయడం ద్వారా save చేసుకొన్న వెబ్సైటు / బ్లాగ్ ఇంటర్నెట్ లేకుండానే offline లో ఓపెన్ చేయవచ్చు .