Gmail లో మనం పంపే మెయిల్స్ schedule చేసుకొని పంపుకోవచ్చు .దీనికోసం ఒక చిన్న Gmail Extension వుంది Boomerang ,దానిని మన క్రోమ్ బ్రౌజరు లో ఇన్స్టాల్ చేసుకొని మనం , ఏ రోజున , ఏ టైం కి మెయిల్ పంపాలో ముందుగా schedule చేసుకొని పంపుకోవచ్చు . క్రోమ్ లోనే కాదు , Firefox,safari వంటి బ్రౌజరు లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు .
గూగుల్ క్రోమ్ లో ఇన్స్టాల్ అయిన తర్వాత , ఎలా set చేసుకోవాలో చూద్దామా ....?
ముందు గా క్రింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయడం ద్వారా వెబ్సైటు కు వెళ్లి Extension install చేసుకోవాలి .
తర్వాత gmail open చేసి మెయిల్ compose చేసి , Recipients దగ్గర ఎవరికి మెయిల్ పంపాలో address టైపు చేసి క్రింది ఉన్న Send Later బటన్ పైన క్లిక్ చేస్తే ఒక popup విండో వస్తుంది ... అక్కడ ఎప్పుడు , ఏ time లో మెయిల్ పంపాలో మన schedule ప్రకారం set చేసుకోవాలి , క్యాలెండరు icon ని వుపయోగించి కూడా set చేసుకోవచ్చు .
క్రింది ఇమేజ్ గమనించండి
క్రింద ఉన్న Boomerand this ఆప్షన్ గమనించండి , ఎ ఆప్షన్స్ ద్వారా మనము పంపిన మెయిల్ , ఎవరికి పంపామో వాళ్ళు చూడకుంటే ( ఉదాహరణకి 2 రోజులు మెయిల్ చూడకుంటే ) మనకు వాళ్ళు మెయిల్ చూడలేదు అన్న విషయం తెలియజేస్తుంది ( పంపిన మెయిల్ ను Inbox లో Top లోకి పంపబడుతుంది ... దీనిని బట్టి మెయిల్ చూడలేదు అన్న విషయం మనము తెలుసుకోవచ్చు) .
క్రింది ఇమేజ్ లో right side చివర ఉన్న cover icon క్లిక్ చేయడం ద్వార , మనం పంపిన మెయిల్ Read అయినదో లేదో మనకు Notification మెయిల్ వస్తుంది . cover icon క్లిక్ చేసిన వెంటనే మనము మెయిల్ compose చేసే విండో లో (
) లైన్ Insert చేయబడుతుంది .
దీనిని వుపయోగించి Month కు 10 మెయిల్స్ కి పైన చెప్పిన సర్వీస్ లు ఉపయోగించుకోవచ్చు . Unlimted services కావాలంటే purchase చేసుకోవాల్సి వుంటుంది . మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి