Layers గురించి అనేక విషయాలు ఫోటోలను Modify చేసే సమయం లో తెలుసు కొందాము , ఈ పోస్ట్ లో ఫోటోషాప్ లోని tools గురించి , ఎలా ఉపయోగించాలో చూద్దాం ... ఫోటో modify చేయాలంటే ఈ టూల్స్ ఎలా చేయబోయే చిత్రాన్ని బట్టి మనం ఏ టూల్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి ...
ఈ పోస్ట్ లో ఎక్కువగా ఉపయోగించే టూల్స్ గురించి తెలుసుకొందాము , మిగిలిన టూల్స్ అవసరానికి తగ్గట్లు ఇమేజ్ ని modify / Edit చేసే సమయం లో తెలుసుకొందాము ....
క్రింది image లో ఫోటోషాప్ లో వున్న Tools ని చూడవచ్చు ....
పైన చిత్రం లో టూల్స్ ని వివరం గా తెలుసుకొందాము .....
Tool Bar లో పైన వున్నా Arrows క్లిక్ చేయడం ద్వారా Toolbar ని Single లైన్ గా లేక Double లైన్ గా చేసుకోవచ్చు .
ఇక టూల్స్ గురించి ... మొదట గా Selection టూల్స్ ని ఇమేజ్ లో Area ని select చేయడానికి , ఒక ఇమేజ్ ని ఒకచోటినుండి మరొక చోటికి కదిలించడానికి వుపయొగిస్తాము.

Marquee Tool(M) - ఈ టూల్ ని వుపయోగించి ఇమేజ్ లో కొంతబాగాన్ని rectangle (Rectangular Marquee Tool ద్వారా ) మరియు round (Elliptical Marquee Tool ద్వారా ) ని సెలెక్ట్ చేయడానికి ఉపయోగిస్తాము .marquee టూల్ ని సెలెక్ట్ చేసుకొని మౌస్ లో Left క్లిక్ ని press చేసి కావలసిన బాగాన్ని సెలెక్ట్ చేసుకోవాలి Marquee టూల్ ని సెలెక్ట్ చేయడానికి Shortcut M. అవసరానికి తగినట్లు Rectangle / Round వుపయోగించుకొంటాము . సెలెక్ట్ చేసుకొనే selection Width , Height exact గా సెలెక్ట్ కావాలంటే Shift కీ press చేసి వుంచి సెలెక్ట్ చేసుకోవాలి .

Move Tool (V): Select చేసుకొన్న ఇమేజ్ ని మనకు కావలసిన Place లోకి Move చేసుకోవచ్చు .
Show Transform Controls సెలెక్ట్ చేసుకోవడం ద్వారా move చేయాలనుకొన్న ఇమేజ్ ని చిన్నదిగా లేక పెద్దది గా మనకు కావలసిన సైజు కి చేసుకోవచ్చు . Move టూల్ ని సెలెక్ట్ చేయడానికి Shortcut V

Lasso Tool (L) : పైన చెప్పిన Marquee Tool లో Rectangle / Round area సెలెక్ట్ చేసుకోనేదానికి ఉపయోగపడుతాయి , కానీ మనకు ఒక ఇమేజ్ లో Edges ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినపుడు Lasso Tool ని ఉపయోగిస్తాము . Lasso Tool ని సెలెక్ట్ చేసుకొని ఎక్కడనుండి సెలక్షన్ ప్రారంబించాలో క్లిక్ చేసి , మౌస్ క్లిక్ క్లిక్ ని వదలకుండా కావలసిన Area అంచుల వెంబడి మౌస్ ని తీసుకెళ్ళి , చివరిగా ప్రారంబించిన చోట మౌస్ క్లిక్ ని వదలడం ద్వారా , కావలసిన Area ని సెలెక్ట్ చేసుకోవచ్చు . పక్క చిత్రం లో చూడండి ..
Polygonal lasso Tool ( L) : ఈ టూల్ ని ఉపయోగించి Straight గా వున్న areas ని సెలెక్ట్ చేయోచ్చు . Start క్లిక్ చేసి మనకు ఎక్కడెక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసుకొంటూ పోయి , ఎక్కడ సెలక్షన్ start చేసామో అక్కడ చివరగా మౌస్ తో క్లిక్ చేస్తే కావలసిన area సెలెక్ట్ చేయబడుతుంది .
Lasso Tool ఉపయోగించే సమయం లో Polygonal lasso కి మారాలంటే ALT కీ ని ప్రెస్ చేయాలి
Magnetic Lasso Tool ( L) : ఈ టూల్ ని ఉపయోగించి selection సులువుగా చేయోచ్చు , సెలెక్ట్ చేసుకోవాలనుకొన్న ఇమేజ్ starting లో క్లిక్ చేసి , ఇమేజ్ edge లో మౌస్ ని ( Press ఉంచకుండా ) ఇమేజ్ Edge ల దగ్గర జరుపుతూ పోతే చాలు Edges automatic గా సెలెక్ట్ చేయబడుతాయి , సున్నితమయిన Edges దగ్గర మౌస్ క్లిక్ చేసి సెలక్షన్ చేసుకోవచ్చు , ప్రారంబించిన దగ్గర మౌస్ పాయింట్ క్లిక్ చేస్తే ఇమేజ్ selection పూర్తి అవుతుంది .
ఇలా సెలెక్ట్ చేసిన Image ని copy ( ctrl + c ) చేసుకొని , కావలసిన చోట Paste (ctrl + v ) చేసుకోవచ్చు .
క్రింది చిత్రం లో గమనించవచ్చు , మొదట వుండే Horse ఇమేజ్ లో చిన్న బాబు ఫోటో సెలక్షన్ చేసి copy , paste చేయగలిగాము , Paste చేసిన ఇమేజ్ ని Move టూల్ తో కావలసిన సైజు కి Transform చేసుకోవచ్చు .
తర్వాతి పోస్ట్ లో మిగిలిన టూల్స్ గురించి వివరం గా తెలుసు కొందాము ...