Photoshop లో Layers లు లేకపోతే Photoshop కి అర్ధమే ఉండదు , ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకసారైనా MS Paint పైన ఇమేజ్ Draw చేసేటప్పుడు ఒకదానిపైన ఒక ఇమేజ్ / text వేసేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనే వుంటారు , అలాంటి వాటికి పరిష్కారమే ఈ ఫోటోషాప్ లోని layers .
ప్రక్క చిత్రం లో చూడండి ఇమేజ్ 1 చిత్రించి తర్వాత , మద్య లో వున్న Yellow కలర్ పక్కకు తీయడం MS Paint లో సాధ్యపడదు , కనీ ఫోటోషాప్ ఇదే ఇమేజ్ ని చిత్రించే సమయం లోనే ఇమేజ్ 1 చిత్రాన్ని 3 లేయర్ ల గా తయారు చేసి , కావలనుకోన్నపుడు ఏ లేయర్ కావాలంటే ఆ లేయర్ ను Edit / Delete , పక్క లయెర్స్ కి ఆటంకం కాకుండా చేయవచ్చు .
తయారు చేయబడే Image / Photo ని బట్టి లేయర్స్ ని arrange చేయవలసి వుంటుంది .
పైన చూపబడిన ఇమేజ్ ఫోటోషాప్ లేయర్స్ లో ఎలా వుంటుందో క్రింది చిత్రాన్ని గమనించండి .
Top లో మొట్టమొదట వుండే లేయర్ Transparent లేయర్,చివర వుండే White కలర్ లేయర్ Back Ground layer,

మనకు ఏదైనా లేయేర్ ఇమేజ్ లో వద్దనుకొంటే , మౌస్ తో ఆ లేయేర్ ముందు వున్నా Eye ఐకాన్ ను Click చేసి అవసరం లేదనుకొన్న లేయర్ ను కనిపించకుండా చేయోచ్చు .
ఉదాహరణకు : పక్క చిత్రం లో గమనించండి , yellow కలర్ ముందు వున్నా Eye ఐకాన్ పైన క్లిక్ చేయడం ద్వారా Bolt లేయర్ Disable చేయబడింది ,

ఏదయినా లేయర్ ని పూర్తిగా ఇమేజ్ నుండి తొలగించాలంటే ఆ లేయర్ ను మౌస్ తో పట్టుకోనివుంచి క్రింది Bin లో drag చేస్తే సరిపోతుంది .
కొత్త లేయర్ ని Create చేసి ఆ లేయర్ పైన ఇమేజ్ ఏర్పరచాలంటే Delete Bin ఐకాన్ ముందు వున్నా ఐకాన్ (పక్క చిత్రం ల చూడండి ) పైన క్లిక్ చేస్తే కొత్త లేయర్ ఏర్పడుతుంది .
తర్వాత పోస్ట్ లో Layers అన్నింటిని ఒకటి చేయడం , ఒకేసారి Move చేయడం , తెలుసు కొందాము .