windows 7 ఆపరేటింగ్ system ద్వారా ... Laptop బాటరీ Health check చేసుకోవడానికి మనం ,system tray లో బాటరీ icon క్లిక్ చేయడం ద్వారా ఎంత శాతం recharge అయిందో తెలుసుకొంటూఉంటాము .
లేదా విండోస్ Short Cut use చేసి కూడా తెలుసుకొంటూ ఉంటాము . Windows Key + X
పైన ఉన్న ఇమేజ్ లలో చూడవచ్చు, 100 % charge అయినట్లు వుంది . కానీ ఇది correct కాకపోవచ్చు . Correct గా తెలుసుకోవాలంటే విండోస్ 7 లో ఒక చిన్న DOS కమాండ్ ని ఉపయోగించి exact గా ఎంత % charge అయిందో తెలుసుకోవచ్చు ... ఎలా చేయాలో చూద్దాం ... :)
- Start బటన్ పైన క్లిక్ చేసి “Search programs and files” box లో "cmd" అని టైపు చేయాలి .
- "cmd.exe" icon పైన క్లిక్ చేసి Run as Administrator క్లిక్ చేయడంద్వారా command విండో ని ఓపెన్ చేయాలి.
- command విండో లో క్రింది command ని టైపు చేసి Enter key press చేయాలి .
powercfg -energy -output c:\energy-report.html
- C drive lo energy-report.html అనే name తో Report file create చేయబడుతుంది .
- File ఓపెన్ చేసి క్రింది కి scroll చేసి "Battery:Battery Information" section లో Design Capacity , Last Full Charge values ని చిన్న Calculation చేస్తే సరిపోతుంది.
- క్రింది ఇమేజ్ లో గమనించండి మొదట ఇమేజ్ లో Full Charged (100%) అని చూపబడినది . అదే క్రింది calculation లో 75% మాత్రమే చూపబడింది .
పైన చూపిన విదంగా చేసి విండోస్ 7 లో Laptop బాటరీ Health ఎలా check చేయాలో తెలుసుకోవచ్చు .
Laptop battery life బావుండాలంటే .... క్రింది చెప్పబడిన విదంగా చేసి Power వినియోగాన్ని తగ్గించుకొని Laptop బాటరీ Life time ని పెంచుకోవచ్చు ...
- Laptop ని ఉపయోగించని పక్షం లో Laptop ని shutdown చేయాలి.
- Work చేసుకొనే సమయం లో మ్యూజిక్ CD / DVD లను Laptop లో play చేయడం తగ్గించాలి
- అనవసరం గా Internal / External Hard Disk / Pen Drive వినియోగం చేయకూడదు , ఉపయోగించనపుడు Unplug చేయాలి .
- Laptop నుండి వచ్చే వేడిని నియంత్రించుకోవడానికి కూలింగ్ Fan లను ఉపయోగించుకొంటే మంచిది .
- Wi-Fi & Bluetooth ని అవసరముంటేనే ON చేసుకోవాలి .
- Volume ని అవసరంలేనపుడు Off / Mute చేసుకోవాలి .
- Laptop Brightness level తగ్గించి పెట్టుకోవాలి .
- అవసరమున్న software లనే run చేసుకొని , అవసరం లేని వాటిని close చేసుకోవడం మంచిది .
- Laptop లో Power management settings ఉపయోగించుకోవాలి .
- Laptop ని standby లో వుంచడం కన్నా వుపయోగించానపుడు Shutdown / Hibernate చేయడం చేయాలి .
- Laptop ని Bed / Bedsheet / దిండు (pillo) / softsurface / త్వరగా heat అయ్యే చోట ఉంచకూడదు .