మీ కంప్యూటర్ లో సౌండ్ టైం ప్రకారం కంట్రోల్ చేసుకోవచ్చు ,మీరు మీ కంప్యూటర్ ని అర్దరాత్రి వరకు ఉపయోగించి పడుకొనేముందు Shut down చేసేసమయం లో విండోస్ shut down సమయం లో సౌండ్ పెద్దదిగా వచ్చి , మీ ఇంట్లో నిద్ర పోయే వాళ్ళ నిద్ర కి అంతరాయం కలిగిస్తుందా , మీరు క్రింద ఇవ్వబడిన ఈ చిన్న టూల్ ఉపయోగించి మీ కంప్యూటర్ లో Volume ని కంట్రోల్ చేసుకోవచ్చు ,
ఏవిదం గా చేయాలో చూడండి ....
ఈ క్రింద ఇవ్వబడిన బటన్ పైన క్లిక్ చేసి Volume Concierge ని డౌన్లోడ్ చేసి install చేసుకోండి
Install చేసుకొన్నా తర్వాత ...
- అప్లికేషను ఓపెన్ చేసి ....Add New Volume Rule అనే లింక్ క్లిక్ చేయడం ద్వారా రూల్ set చేసుకోవాలి.
- volume కంట్రోల్ ప్రతిరోజూ లేక వర్కింగ్ డేస్ లోన లేక వీకెండ్స్ లోనా set చేసుకోవాలి , (Every day / Workdays / Weekends )
- తర్వాత ఏ time కి volume తగ్గిపోవాలి లేదా పెరగాలి అని time set చేసి , ఎంత % కావాలో set చేసుకోవాలి ,