ఈ పోస్ట్ లో ఫోటోషాప్ మరికొన్ని ముఖ్యమయిన టూల్స్ గురించి చూద్దాము ...
Eyedropper Tool (I) : ఈ టూల్ ని వుపయోగించి మన దగ్గరున్న ఇమేజ్ లో వున్నా కలర్ ని సెలెక్ట్ చేసుకొని , ఆ కలర్ ని వేరే ఇమేజ్ లో ఉపయోగించుకోవచ్చు .

ఇమేజ్ లో గమనించండి Foreground లో బ్లూ కలర్ , Background లో గ్రీన్ కలర్ ఇమేజ్ నుండి సెలెక్ట్ చేయబడింది .

Patch Tool (J) : Image కు patch వర్క్ చేసేదానికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది . క్రింది ఇమేజ్ లో గమనించండి , Heart సింబల్ ని తొలగించి అదే ఇమేజ్ లో Clouds వున్నా పార్ట్ తో Patch చేయబడుంది .
టూల్ బార్ నుండిPatch Tool ని సెలెక్ట్ చేసుకొని, ఇమేజ్ లో ఏ బాగాన్ని Patch చేయాలో , ఏ బాగం తో చేయాలో చూసుకొని , టూల్ తో Patch చేయాల్సిన పార్ట్ చుట్టూ డ్రాగ్ చేసి , ఏ బాగం తో చేయాలో అక్కడకు సెలెక్ట్ చేసిన బాగాన్ని డ్రాగ్ చేసి వదిలితే సరిపోతుంది .
Clone stamp Tool (S) : ఈ టూల్ ఎలా పని చేస్తుందంటే , లెటర్స్ హెడ్స్ పైన స్టాంప్ ని ముద్రిస్తాము కదా, Ink లో అద్ది , డాక్యుమెంట్ లో ఎక్కడ స్టాంప్ వేయాలో అక్కడ వేసినట్లే .... ఈ టూల్ ఇమేజ్ లో ఒకచోట వున్న pixel ని (copy చేసి) మరోకచోటకితీసుకోవడానికి ఉపయోగపడుతుంది . Patch Tool మాదిరిగా ఈ టూల్ కూడా patch వర్క్ , ఇమేజ్ ని Retouch చేసేదానికి ఉపయోగిస్తారు ,

Options లో ఎంత Opacity , Flow కావాలో సెట్ చేసుకొని ఇమేజ్ ని clone చేసుకోవచ్చు .
ప్రక్కనవున్న ఇమేజ్ లో గమనించండి , ఇండియా మ్యాప్ లో మద్య లో వున్న అశోకచక్రాన్ని పక్కన ఇమేజ్ లో క్లోన్ చేయబడింది .

Smudge టూల్ ని సెలెక్ట్ చేసుకొని ,Options లో ఎంత Opacity , Flow కావాలో సెట్ చేసుకొని ఇమేజ్ ని లేక edges ని adjust చేసుకోవచ్చు. ప్రక్కన వున్న ఇమేజ్ గమనించండి , ఇమేజ్ 1 లో వున్నా ముడతలు , rough గా వున్న Face smooth ఎలా అయిందో గమనించండి .


(Burn Tool)
ఇంతవరకు ముఖ్యమయిన టూల్స్ గురించి ఇవ్వడ జరిగింది . మిగిలిన టూల్స్ ని ఇమేజ్ లు Edit చేసేసమయం లో వివరం గా తెలుసుకొందాము .
ఈ పోస్ట్ పైన మీ కామెంట్ తప్పక తెలియజేయండి ... మీకు ఏమైనా సందేహాలు వుంటే techwavetutorials@gmail.com కి మెయిల్ చేయండి , ఈ పోస్ట్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా పంపండి .