ఫోటోషాప్ నేర్చుకొందాము 6 - ఫోటోషాప్ బేసిక్స్ - Tool Bar -1 లో Selection Tool లో Move మరియు Lasso టూల్స్ గురించి తెలుసుకొన్నాము , ఈ పోస్ట్ లో మరికొన్ని టూల్స్ గురించి తెలుసుకొందాము ...
Magic Wand Tool (W) : Image లో ఒకే రంగులో వుండే Part ని సెలెక్ట్ చేయడానికి ఈ టూల్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది . ఈ టూల్ ని సెలెక్ట్ చేసి ఇమేజ్ పైన క్లిక్ చేస్తే , ఇమేజ్ యొక్క కలర్ మరియి Pixel ఆదారంగా సెలెక్ట్ చేయబడుతుంది . కొన్ని సమయాల్లో కొంచెం difference వున్న కలర్స్ ని సెలెక్ట్ చేయడం కష్టమవుతుంది ( ఉదా : red కలర్ లో లైట్ red వుంటే , dark రెడ్ కలర్ మాత్రమే సెలెక్ట్ చేయబడుతుంది , Light కలర్ Red కాకపోవచ్చు) , అటువంటి situation లో Tolerance ఆప్షన్ చక్కగా ఉపయోగ పడుతుంది .
Tolerance ఆప్షన్ ఇమేజ్ యొక్క Brightness Level range ఆదారంగా వుంటుంది , దీనిని range 0 - 255
Default విలువ 34 , 255 అంటే మొత్తం ఇమేజ్ సెలెక్ట్ చేయబడుతుంది . selection కి అనుగుణంగా Value ని మార్చుకొనవచ్చు .

Quick Selection Tool (w) : Image లో కావలసిన బాగాన్ని సెలెక్ట్ చేయడానికి ఉపయోగించే టూల్స్ లో చాలా అద్బుతమయిన , సులభం గా ఉపయోగించడానికి వీలుపడే టూల్ ఇది.

1. New Selection ఆప్షన్ : ఇది default గా వుంటుంది .
2. Add to selection : selection చేసిన బాగానికి ఇంకా కొంత బాగాన్ని చేర్చాలంటే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది .
3. selection చేసిన బాగము నుండి కొంత బాగాని తీసివేయాలంటే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది .
4. Brush settings లోBrush సైజు , Hardness మరియు spacing ఒప్షన్స్ కలిగివుంటాయి ( ఈ ఆప్షన్స్ తర్వాతి పోస్ట్ లలో ప్రాక్టికల్ గా చేద్దాము )
5. మన ఇమేజ్ లో చాలా Layers వున్నప్పుడు సెలక్షన్ అన్ని layers నుండి చేయాలనుకోన్నప్పుడు ఈ ఆప్షన్స్ ని వుపయోగిన్చుకోవాలి .


ఈ టూల్ కూడా crop టూల్ వలే పనిచేస్తుంది , దీనిలో Rectangle shape వలె సెలక్షన్ కాకుండా, ఇమేజ్ లోని Corners (అంచులను ) ని Move చేసుకొనే వీలువుంది . (పక్కన వున్నా ఇమేజ్ ని గమనించండి )
ఇలా selection అయ్యాక మౌస్ క్లిక్ ని వదిలిపెట్టి Enter కీ press చేస్తే చాలు , సెలెక్ట్ చేసుకొన్నా Part వదిలి మిగిలిన బాగము Crop చేయబడుతుంది .
తర్వాతి పోస్ట్ లలో మరికొన్ని ఆసక్తి కరమయిన టూల్స్ గురించి వివరం గా తెలుసుకొందాము .
ఈ పోస్ట్ పైన మీ కామెంట్ తప్పక తెలియజేయండి ... మీకు ఏమైనా సందేహాలు వుంటే techwavetutorials@gmail.com కి మెయిల్ చేయండి , ఈ పోస్ట్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా పంపండి .