ఎటువంటి software లేకుండా ఆండ్రాయిడ్ మొబైల్ స్పీడ్ పెంచడం ఎలా ?

2 minute read
ఆండ్రాయిడ్ మొబైల్ స్లో గా లోడ్ అవుతుందా ? స్లో గా లోడ్ అవడం వలన చాలా చికాకుగా అనిపిస్తూ వుంటుంది కదా ? ఈ ఆర్టికల్ లో ఇవ్వబడిన కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా మన ఆండ్రాయిడ్ మొబైల్ ను మునుపటికంటే వేగంగా చేయవచ్చు . 


దీనికోసం ఎటువంటి software ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే , మొబైల్ లో ఉన్న కొన్ని సెట్టింగ్ లు మార్చడం ద్వారా ఈ పని చేయవచ్చు .ఈ సెట్టింగ్ లను మార్చాలంటే ముందుగా మొబైల్ ను Developer Mode లోకి మార్చాల్సి ఉంటున్నది .

మొబైల్ ను Developer Mode లోకి ఎలా మార్చాలి ?

ముందుగా సెట్టింగ్ లోకి వెళ్లి Developer ఆప్షన్స్ లోకి వెళ్ళాలి , developer ఆప్షన్స్ లేదంటే , About Devices ఆప్షన్ పైన Tap చేస్తే వచ్చే screen లో Build Number ఆప్షన్ వుంటుంది , Build Number ఆప్షన్ పైన 7 సార్లు Tap చేస్తే మొబైల్ లో Developer ఆప్షన్ వస్తుంది .

తర్వాత Settings screen లోకి వెళ్ళితే Developer ఆప్షన్ కనబడుతుంది . ( సెట్టింగ్స్  స్క్రీన్ లో చూడండి )

  • Developer ఆప్షన్ లో చివర లో Windows Animation Scale,Trasaction Animation Scale,Animatio Duration Scale ఆప్షన్స్ చూడవచ్చు , అది Default గా 1X సెట్ చేయబడివుంటుంది ( 1x నుండి 10 x వరకు ఉంటాయి) , Anmation Off చేయోచ్చు లేదంటే తగ్గించుకోవడం (0.5) చేయాలి.Windows వేగం గా లోడ్ అవడం గమనించవచ్చు 
  • Developer ఆప్షన్ లో Apps సెక్షన్ లో Do Not Keep Activities , Check Box సెలెక్ట్ చేయడం ద్వారా ఉపయోగించే App నుండి Exit అయితే Background లో App రన్ అవకుండా close అవుతుంది , దీని ద్వారా మొబైల్ వేగం గా వుంటుంది . 
  • కానీ whatsapp , facebook app లు close చేసినా కూడా Background లో రన్ అవాల్సిన అవసరం లేదనుకొన్న వారు ఈ ఆప్షన్ ఉపయోగించవచ్చు .
  • ఒకేసారి ఒకటికంటే ఎక్కువ Apps రన్ అవుతున్నప్పుడు , కొన్ని సమయాల్లో ఒకటి తర్వాత ఒకటి ఓపెన్ చేస్తూ ఉంటాము కదా ? అలా ఎన్ని apps ఓపెన్ కావాలనే Limit సెట్ చేసుకోవచ్చు .
 Default గా Standrd వుంటుంది (ఓపెన్ చేసిన Apps లో ఏ App కయినా మారే అవకాసం వుంటుంది ) . Apps మనకు Background లో ఎన్ని  కావాల్సిన Number  ( 1 నుండి 4  ) సెట్ చేసుకోవచ్చు . ఒకటి కూడా వద్దనుకొంటే No Background Processes సెట్ చేసుకోవచ్చు .
ఇలా ఏ software లేకుండా , మొబైల్ device ను ఈ చిన్న సెట్టింగ్స్ వుపయోగించి , వేగవంతం చేయోచ్చు .
ఈ ఆర్టికల్ మీ మిత్రులతో కూడా షేర్ చేయండి . 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top