గత పోస్ట్ ( ఫోటోషాప్ నేర్చుకొందాము 4 - ఫోటోషాప్ బేసిక్స్ - Layers-1) లో లేయర్స్ గురించి కొంత వరకు తెలుసుకొన్నాము, ఈ పోస్ట్ లో తయారు చేయబడిన లేయర్స్ ని Merge చేయడం,వాటిని ఒకేసారి Move చేయడం వంటి అంశాలు చూద్దాం , ఇంకా Layers Pallet ఒప్షన్స్ గురించి కూడా చూద్దాం ,
ఒకేసారి Move చేయడం : క్రింది ఇమేజ్ లో గమనించండి , ఒక ఇమేజ్ పైన 3 బార్బీ ఇమేజ్ లు 3 లేర్స్ గా (layer 1,layer 2 మరియు layer 3) గా వున్నాయి . 3 ఇమేజ్ లు క్రింది బాగాన వున్నాయి , ఇప్పుడు అన్నింటిని ఒకేసారి పై బాగానికి Move చేస్తున్నాము , ఎలా చేయాలంటే layer 1 పైన మౌస్ తో క్లిక్ చేసి వుంచి , తవాట Shift కీ పట్టుకొని తర్వాత layer 3 పైన క్లిక్ చేస్తే , మద్య లో వుండే layer 2 కూడా సెలెక్ట్ చేయబడుతుంది , సెలెక్ట్ అయ్యాక ఏ బాగం లో కావాలంటే ఆ బాగం లో 3 layers ని ఒకేసారి Move చేయవచ్చు .
Merge చేయడం : ఏ Layers అయితే merge చేయాలనుకొంటున్నామొ ఆ Layers ని సెలెక్ట్ చేసి Ctrl కీ press చేసి వుంచి ఆ లేయర్స్ ని సెలెక్ట్ చేసుకొని , లేయర్స్ పైన Right క్లిక్ చేసి , వచ్చె menu నుండి Merge Layers ఆప్షన్ సెలెక్ట్ చేసుకొంటే , Layers ఒకటిగాMerge అయిపోతాయి .
Layers Pallet Options చాలానే వున్నాయి , వాటన్నింటిని తర్వాతి పోస్ట్ లలో ప్రాక్టికల్ గా ఇమేజ్ ని ఎడిట్ చేసేటప్పుడు నేర్చుకొందాము , తర్వాతి పోస్ట్ లో ఫోటోషాప్ Tool Bar లోని టూల్స్ గురించి ఒక్కొక్కటి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాము .