ఆన్లైన్ వెబ్ సైట్ లలో న్యూస్ letters subscribe చేసుకోన్నారా ? అవి మీ Inbox లో వందలకొద్దీ వచ్చి చేరుతున్నాయా ? అవి రాకుండా చేయాలంటే సాదారణం గా మనం Comapny సంబందించిన మెయిల్ open చేసి , మెయిల్ క్రింద వుండే Un subscribe బటన్ క్లిక్ చేస్తూ ఉంటాము . అలా ప్రతి company మెయిల్ ఓపెన్ చేసుకొని ప్రతి మెయిల్ un subscribe చేయాలంటే చాలా కష్టం గా వుంటుంది .
అలా కష్ట పడకుండా చాలా సులువుగా Un subscribe చేసుకోవాలంటే మనకు ఒక అద్బుతమయిన వెబ్సైటు అందుబాటులో వుంది .ఈ వెబ్సైటు ని ఉపయోగించుకొని చాలా సులువు గా న్యూస్ letters Un subscribe చేసుకోవచ్చు.ఇలా చేసిన తర్వాత నుండి ఇక మీరు Unsubscribe చేసిన కంపెనీ మెయిల్స్ మీ మెయిల్ లోకి వచ్చి చేరవు.
ఎలా చేయాలో చూద్దామా ?
- https://unroll.me/ వెబ్సైటు ని ఓపెన్ చేయాలి.
- Login బటన్ పైన క్లిక్ చేసి ఏ ఈమెయిల్ లో చేయాలనుకొంటున్నామో ఆ ఈమెయిలు ID లాగిన్ చేసి continue బుటన్ పైన క్లిక్ చేయాలి.
- Privacy policy ని accept చేయాలి . company subscriptions అన్ని లిస్టు చేయబడుతాయి .
- మనకు ఏ company News Letter వద్దనికొంటున్నామో దాని పక్కన Un subscribe క్లిక్ చేయాలి.
- ఇక నుండి మన మెయిల్ బాక్స్ లో company News Letter వచ్చి చేరడం ఆగిపోతుంది .
