గత పోస్ట్ లలో ఫేస్బుక్ సెక్యూరిటీ settings గురించి తెలుసుకొన్నాము ( Facebook Security మరియు Privacy settings ల గురించి తెలుసుకొందాం ). ఈ పోస్ట్ లో సెక్యూరిటీ Setting లలో బాగం గా మరి కొన్నింటిని చూద్దాము.
కొందరు మన Facebook లో ప్రొఫైల్ లోకి వెళ్లి ఫ్రెండ్స్ list లో Friends ని Add చేసుకొంటూ వుంటారు . అది మన Friends లేక మనకు తెలిసిన వాళ్ళయితే పర్వాలేదు ... కానీ మనకు తెలియని వాళ్ళు కూడా కొందరు ఇలా చేసే ఆస్కారం వుంది. ముఖ్యం గా Ladies / Girls ప్రొఫైల్స్ లోకి వెళ్లి ... వాళ్ళ ఫ్రెండ్స్ list లో Ladies / Girls కి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపడం ... వాళ్ళ ఫోటో లను copy చేసుకొని అశ్లీలం గా తయారు చేసి పోస్ట్ చేయడం లాంటి సందర్బాలు చాలానే చూస్తున్నాం ...Friends list ఇతరులకు కనపడకుండా Hide చేసుకొని public కి మన ప్రొఫైల్ లో ఫ్రెండ్స్ list కనపడకుండా చేసుకోవచ్చు.
దీనికోసం క్రింద చెప్పిన విదం గా చేయాలి ...
- మొదటగా Friends list ఓపెన్ చేయాలి.
- Right side వుండే మేనేజ్ icon పైన క్లిక్ చేయాలి.
- వచ్చిన drop-down మెనూ లో Edit Privacy ఎంచుకోవాలి .
- వచ్చిన విండో లో Default గా Public అని వుంటుంది , ఆ Option ని Only Me గా మార్చుకొని Close పైన క్లిక్ చేస్తే సరిపోతుంది .
- ఇదే విదంగా Friends మరియు Custom ఆప్షన్స్ వ్మార్చుకోవడం ద్వారా మన Friends కి , లేదా మనకి కావాల్సిన లిస్టు కి మాత్రమే కనపడేలా Set చెసుకొవచ్చు.
అలాగే Following మరియు Followers options కూడా అదేవిదమయిన Options సెట్ చేసుకొని మనం ఎవరిని Follow అవుతున్నాము ,లేక మనల్ని ఎవరు Follow అవుతున్నారు అనే విషయం పబ్లిక్ కి లేదా మన ఫ్రెండ్స్ కి కూడా తెలియకుండా చెసుకొవచ్చు.